Monday, November 1, 2010

జన గణ మణ పాడేద్దాం!

జన గణ మణ పాడేద్దాం,
ఒక పనై పోతుంది.
అందరం ఇళ్ళకు పోతాం,
తింటాం... పండుకుంటాం.

మళ్ళా కలుస్తాం. కలసి ఉంటామా?
ఆ గీతంలో ఉన్న ప్రాంతాలకి
ఇంకా కొన్ని చేర్చి, చెర్చి, చర్చిస్తాం.
విభజించటం ఒక్క తెల్ల దొరల సొంతమేనా?

మనం ఇంకా చేస్తాం దండుగా
పండగల్ని, కులాల మతాల పేరుతొ;
సమ్మతాల అపనమ్మకాల పేరుతో.

కనీసం పాటయినా పాడుకోటానికి
స్వతంత్రం లేని ఈ గణతంత్రంలో
జన గణ మణ మనుగడ ఎలా?

పోనీ, మన పాట్లతో కలిపి పాడేద్దాం,
మనందరి మనుగడలా,
జన గణ మణ, పాడేద్దాం !

--శేషు చామర్తి